04-03-2025 12:47:46 AM
రుణాల రికవరీ చేసి బ్యాంకులకు చెల్లించడం లేదని ఆరోపణ
లోన్ మంజూరు సమయంలో కమీషన్ వసూలు
సూర్యాపేట, మార్చి 3 (విజయక్రాంతి) : నిర్మూలించి, మహిళలకు ఆర్ధిక స్వాంతన కలుగజేసే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన స్త్రీనిధి జిల్లాలో పక్కదారి పడుతోంది. స్వయం సహాయక సభ్యులను ప్రోత్సహిస్తూ సంఘాల బలోపేతానికి కృషి చేయాల్సిన గ్రామాల్లో వీవోఏలు( విలేజ్ అర్గనైజింగ్ అసిస్టెంట్) పట్టణాలలో ఆర్పి (రిసోర్స్పర్సన్)లు రుణాలు మంజూరు దగ్గర నుంచి చెల్లింపుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి స్వయం సహయా క సంఘల్లో అమాయక మహిళల అవసరాలను ఆసరాగా తీసుకొని అందినకాడికి దండుకుటున్నట్లు ప్రచారం జరుగుతోంది సంఘాలపై వీరు పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయి స్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఆర్పి, వీవోఏల ఆక్రమాలపై ఒక్కోక్కటిగా పిర్యాదులు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ, గ్రామీణ సంఘాలకు రుణాల మంజూరుతో పాటు రికవరీలో భారీ అవకతవకాలు జరిగినట్లు తెలుస్తోంది. సంఘాల ఆడిట్ నిర్వహిస్తే జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరులో జరిగిన అవకతవకలు బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఇందులో అధికారుల పాత్ర కూడా ఉండటంతో పిర్యాదుల అందిన పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు.
జిల్లాలో 790 సమాఖ్యలు..
సూర్యాపేట జిల్లాలో 475 పంచాయతీలలో మొత్తం 17,435 మహిళా సంఘాలు ఉండగా 578 గ్రామైఖ్య సమాఖ్య(మహిళా సమాఖ్య)లు ఉన్నాయి. ఇక జిల్లాలో ఐడు మున్సిపాలిటీలలో 5,251 సంఘాలు ఉండగా 212 స్లమ్ సమాఖ్యలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 790 మహిళా సమాఖ్యలు ఉండగా గ్రా మీణ ప్రాంతాల్లో వీవోఏలు, పట్టణ ప్రాంతాల్లో ఆర్పిలు సంఘల భాధ్యతలను నిర్వహిస్తారు.
పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్ధిక చేయూతను అందించేందుకు 2010లో ఉమ్మడి ఆంద్రప్రదేష్ ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేసింది. అవసరమైన సందర్భం లో బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేస్తూ మైక్రోఫైనాన్స్ నిర్వాహకుల అధిక వడ్డీ భారీ నుంచి కాపాడాలనే ఉద్ధేశ్యంతో బ్యాంకుకు రూపకల్పన జరిగింది.
ఇందులో భాగంగా పేదరికంలో ఉన్న మహిళలను సంఘాలగా ఏర్పాటు చేసి, వారితో నెలనెల రూ. 100 చొప్పున పొదుపు చేయిస్తూ.. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తూ వస్తోంది. 20 గ్రూపులను ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి స్త్రీనిధి బ్యాంకు ద్వారా సంఘల్లోని సభ్యులకు రూ 30 వేల నుంచి అరత మేరకు రూ.3లక్షల వరకు రుణం అందిస్తోంది.
వీవోఏ, ఆర్పీల చేతివాటం...
సంఘాల్లో సభ్యులగా ఉండి స్త్రీనిధి ద్వారా రుణం పొందేందుకు అరత గల సభ్యులను గుర్తించి వారికి రుణాలను అందించే భాధ్యతను పట్టణాలలో ఆర్పీలు, గ్రామాల్లో వీవోఏలు చూస్తారు. సభ్యులు తీసుకున్న రుణం వాయిదాలను ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంకుల్లో చెల్లించేలా సభ్యులకు వీరు అవగహన కల్పించవలసి ఉంటుంది. అయితే రుణాల మంజూరు సమయంలో వీవోఏలు, ఆర్పీలు రూ.500 నుంచి రూ. 2వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.
ఇక కొన్ని చోట్ల ఆర్పీలు, వీవోఏలు రుణాలను రికవరీ చేసి బ్యాంకులో చెల్లించకుండా స్వంతానికి వాడుకుంటున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చే వరకు సంఘాల సభ్యులకు కూడా ఈ విషయం తెలియడం లేడని అంటున్నారు. కొన్ని మండలాలలో సంఘాల సభ్యులకు తెలువకుండానే రుణాలు మంజూరు చేసి సంఘం అద్యక్షులతో కుమ్మకై వీవోలు కాజేస్తున్నారని అంటున్నారు.
ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయని పలు పిర్యాదులను చూస్తే అర్ధమవుతున్నది. జిల్లాలో సమాఖ్యలపై ఆడిట్ నిర్వహిస్తే ఆర్పి, వీవోఏల అక్రమాలు బయటపడే అవకాశం ఉన్నది. ఆడిట్ ఖర్చు సంఘాలు పెట్టుకోవాలని అధికారులు అంటుండటంతో ఆడిటక్కు సంఘాల సభ్యులు వెనుకాడుతున్నారు.