calender_icon.png 17 January, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహజ పుష్పాలతోనే పేర్చండి!

08-10-2024 12:00:00 AM

నిజమే, పూల ధరలు పెరుగుతున్నాయి. అసలు కావలసిన పూలు ప్రకృతిలోనూ బాగా తగ్గిపోతున్నాయి. అయినా సరే, బతుకమ్మ అంటేనే పూలను పూజించే పండుగ. దీనిని కృత్రిమ పూల కాగితాలతో తయారు చేయడం అన్యాయం. ఉన్నంతలో సహజ సిద్ధమైన పుష్పాలను ఉపయోగించాలనే ప్రతీ మహిళా కోరుకుంటారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో కాగితం బతుకమ్మలు వాడుతున్నారు.

సైజు పెద్దగా ఉండాలన్న కాంక్షతో కాగితం బతుకమ్మలను పళ్లేలలో పెట్టుకుని తీసుకెళ్లే దృశ్యాలు చాలా సహజం. ఉన్నంతలో చిన్నగా అయినా సరే, నిజమైన ప్రకృతి పూలతోనే బతుకమ్మను చేసి, పూజిద్దాం. అప్పుడే ఈ పండగలోని పరమార్థం సిద్ధిస్తుంది. వినాయకుడిలాగా సహజమైన పూలకు బదులుగా కాగితపు బతుకమ్మలు పేర్చి ప్రకృతి విరుద్ధమైన పోకడలకు స్వస్తి చెబుదాం. చిన్నవైనా, పెద్దవైనా సహజ పూలతోనే బతుకమ్మను పేర్చుదాం.

ఉమా శేషారావు వైద్య