18-02-2025 01:38:32 AM
నల్లగొండ, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ప్రధాని మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియ ర్ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దేశ ప్రజలు మోదీ నాయకత్యాన్ని కోరుకుం టున్నారని.. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
నల్లగొం డ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి మద్దతుగా సోమవారం ఆయన మిర్యాలగూడలో ఉపా ధ్యాయులతో సమావేశమై అనంతరం విలేక రులతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభు త్వం దారుణంగా విఫలమైందని మండి పడ్డారు.
అధికారం లోకి వచ్చి ఏడాదిపైగా గడిచినా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేక చేతులెత్తేసిం దని విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంభి స్తున్నదని ఆక్షేపించారు.
ఫీజుల విడుదలలో జాప్యం..
ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదలలో జాప్యం చేస్తుండడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నార న్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. పట్టభద్రలు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, సునీత రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, పాపారావు, హనుమంత రెడ్డి, రేపాల పురుషోత్తం రెడ్డి, అశోక్ రెడ్డి, సీతారాం రెడ్డి, బంటు సైదులు, చిలుకూరి శ్యామ్, ఎడ్ల రమేష్, బంటుగిరి, వెంకటేశ్వర్లు, పెదమామ్ భరత్ ఉన్నారు.