calender_icon.png 11 October, 2024 | 4:05 AM

నిలకడగా బంగారం ధరలు

27-08-2024 12:00:00 AM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ స్థిరం గా కొనసాగాయి. రెండు రోజుల క్రితం ఎగసిపడిన పసిడి ధరలు సోమవారం నిలకబడగా ఉన్నాయి.  విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర పదిగ్రాములు రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబయి, బెం గళూరు, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర లు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఎలాంటి మార్పూ లేకుండా నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ధరల్లో స్వల్పంగా తగ్గుదల నమోదయింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.92,900 వద్ద నమోదయింది.