calender_icon.png 15 October, 2024 | 12:02 AM

నిలకడగా బంగారం ధరలు

20-08-2024 12:30:00 AM

హైదరాబాద్: దేశంలో పసిడి కొనుగోలుదారులకు ఊరట కొనసాగింది. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు సోమవారం (ఆగస్టు 19) పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగాయి. బంగా రం ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,770 వద్ద నిలకడగా ఉన్నాయి.

ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పు కనిపించలేదు. 22 క్యారెట్ల బంగా రం ధర రూ.66,850, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,920 లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎటువంటి కదలిక లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,000 వద్ద ఉంది.