calender_icon.png 5 October, 2024 | 2:53 AM

ధంగర్ కమ్యూనిటీకి ఎస్టీ హోదా

05-10-2024 12:51:21 AM

వ్యతిరేకిస్తూ సెక్రటేరియట్ పైనుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే

ముంబై, అక్టోబర్ 4: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతరికేకించిన డిప్యూటీ స్పీకర్, ఓ ఎమ్మెల్యే శుక్రవారం రాష్ట్ర సచివాలయ భవనం 3వ అంతస్తు నుంచి దూకేశారు. అయితే అక్కడున్న సేఫ్టీ నెట్‌లో పడటంతో ప్రాణాలతో బయటపడ్డారు.

మహారాష్ట్రలోని ధంగర్ కమ్యూనిటీ కి.. ఎస్టీ హోదా కల్పిస్తూ ఇటీవల ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని గిరిజన కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌తో పాటు ఇతర గిరిజన ఎమ్మెల్యేలు.. శుక్రవారం సచివాలయంలో సీఎం ఎక్‌నాథ్‌షిండేను కలిశారు.

వారి డిమాండ్లకు సీఎం అగీకరించక పోవడంతో గిరిజన సమాజానికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేస్తూ సచివాలయం మూడో  అంతస్తు నుంచి దూకేశారు. వారు అక్కడ ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌పై పడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  వారిద్దరూ వలలో చిక్కుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు తీశారు.