calender_icon.png 9 March, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణతంత్ర దినోత్సవ కవాతుకు సెయింట్ పాల్స్ స్కౌట్స్, గైడ్స్ ఎంపిక

26-01-2025 12:17:49 AM

కరీంనగర్, జనవరి 25 (విజయక్రాంతి):  కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలలో స్కౌట్స్ & గైడ్స్ కవాతు (పరేడ్) కు స్థానిక వావిలాలపల్లిలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న గైడ్ విద్యార్థిని చెలిమెల శివాని, స్కాట్ విద్యార్థి సుంకె గుణదీప్ ఇద్దరు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ మోటుపల్లి రాజుకుమార్, ప్రిన్సిపాల్ మోటుపల్లి లీన ప్రియదర్శిని, స్కౌట్ మాస్టర్ గంగారపు మల్లేశం, గైడ్ కెప్టెన్ గంగారపు సుమలత, ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు అభినందించారు.