calender_icon.png 23 April, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన సెయింట్ పాల్స్

22-04-2025 06:51:34 PM

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో సెయింట్ పాల్స్ కళాశాల భద్రాచలం ప్రథమ సంవత్సరం ఇంటర్ చదువుతున్న ఎన్ కిషన్ ఆదర్శ అనే విద్యార్థి  467/470 మార్కులను సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాను చదువుతున్న కళాశాలకు ఘన కీర్తిని తీసుకొచ్చినందుకు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ కె అబ్రహం, ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ కె  రాధ మంజరి ఆ మేడం అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయిలో నిలవాలని ఆశీర్వదించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్లు అయిన ఎస్ రాజేష్, డాక్టర్ కే అలీన శాంతి ఈ సందర్భంగా విద్యార్థికి, తల్లితండ్రులైన రమణారావు, శ్రీమతి స్వప్న లకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థికి అభినందనలు తెలిపారు.