12-03-2025 12:06:57 AM
ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతు న్న సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’. దర్శకుడు రాజమౌళి ఎంత సైలెంట్‌గా షూటింగ్ చేసుకుంటూ పోతు న్నారో ఈ సినిమా బయట అంత సౌండ్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తోందని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియా ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.
ఆ వీడియోను బట్టి ఆమె ఒడిశా వెళ్లినట్టు తెలుస్తోంది. ఫ్లుటై నుంచి బయటకు చూస్తున్న ఫోటోతో పాటు ఒడిశా వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న వీడియోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. అయితే ఆమె ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ షూటింగ్ కోసమే ఒడిశా వెళ్లినట్టు సమాచారం. తాజాగా సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే..
ఈ సినిమాలో రాజమౌళి కాశీ నగరాన్ని చూపించనున్నారట. అయితే రద్దీగా ఉండే కాశీలో సినిమా షూటింగ్ చాలా కష్టం కాబట్టి కాశీని తలపించే సెట్ వేస్తారట. సినిమాలో కీలక భాగం ఈ నగరంతో సంబంధం ఉంటుందట. ఈ సినిమా ముఖ్యంగా అడవులు, నదులు, ఆధ్యాత్మిక నగరాలతో ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని రాజమౌళి అందించనున్నారట.