05-03-2025 12:00:00 AM
ఇప్పటికే 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠాలు ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలలో మాత్రం తూచా తప్పకుండా నిబంధనలు అమలు
ప్రైవేట్ పాఠశాలలో ప్రారంభమైన పదవ తరగతి సిలబస్
అన్ని విషయాలు తెలిసిన పట్టించుకోని విద్యాశాఖ
ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలలకేనా ?
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం : మహబూబ్ నగర్ డీఈవో ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్, మార్చి 4 (విజయ క్రాంతి) : నిబంధనలు అందరికీ సమానం... ఎవరు వీటిని అతిక్రమించకూడదు... అధికమిస్తే చట్ట ప్రకారం దోషులవుతారు... ఇలా అధికారుల నుంచి మనం నిత్యం వింటున్న మాట. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న విషయాలను చూస్తే ప్రభుత్వ పాఠశాలలో మేమెందుకు చదువుతున్నామనే ఆవేదన స్మరించుకోక తప్పదు... ఇందుకు ప్రధాన కారణాలు లేకపోలేదు. ప్రైమరీ విద్యాభ్యాసంలో ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి వారి బైలాను పాటించిన ఎవరు పట్టించుకోనే వారే కరువయ్యారు.
ఏదో ప్రైమరీ తరగతులు ఎలాగో అలాగా చెప్పుకోండి పిల్లలను బాగు చేస్తే చాలని పాఠశాలకు ఉన్న బైలాను; విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు చూసి చూడనట్టు ఉంటూ మద్దతు తెలియజేస్తున్నారు. కాగా కొన్ని పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే 10వ తరగతి చదువులు ప్రారంభం కావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మాత్రం తొమ్మిదవ తరగతి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగనున్న పరీక్షలకు సిద్ధమవుతుండ్రు.
కొన్ని ప్రైవేట్ పాఠశాల ల యజమాన్యాలు ఇప్పటికే 9వ తరగతి పరీక్షలు కాకముందే 10వ తరగతి పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు సిద్ధం చేయడం గమనారం. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంకా వార్షిక పరీక్షలు ప్రారంభం కాలేదు. కాగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది జరగనున్న 10వ తరగతి ప్రధాన పరీక్షలకు సిద్ధం చేయడం పాఠాలు ప్రారంభించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. విద్యా సంవత్సరంలో మాత్రం ప్రభుత్వ పాఠశాలకు అమలు చేస్తున్న అధికారులు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ర్యాంకులు రాగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ర్యాంకులు తగ్గుముఖం పడుతున్నాయి.
నిబంధనలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కేనా...?
కొన్ని ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ఆ పుస్తకాలను పక్కనపెట్టి పదవ తరగతి పుస్తకాలు అందించి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు తొమ్మిదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతుండ్రు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యనభ్యసిస్తే కొన్ని ప్రైవేట్ పాఠశాలు; ఉన్న; నిబంధనలు మాత్రం పట్టించుకోకుండా ఇప్పటికే 9వ తరగతి విద్యార్థులకు 10 వ పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
ఇలా ప్రవేట్ పాఠశాలలో దాదాపు ఒకటిన్నర ఏడాది పదవ తరగతి పాఠ్యాంశాలను చదివి పరీక్షల సిద్ధమవుతుంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రం నిబంధనలు మేరకు మాత్రమే పాఠ్యపుస్తకాలను అందిస్తూ, బోధిస్తూ వచ్చే ఎడాది మార్చి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో ముందుగానే పదవ తరగతి పాఠ్యాంశాలు 9వ తరగతి విద్యార్థులకు బోధించడంతో అత్యధిక సమయం తో విద్యనభ్యసిస్తున్న ప్రైవేట్ పాఠశాలల కు ర్యాంకులు రాకపోతే మరేం వస్తాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం నిబంధనలు అమలు చేసి వారిని మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం సరికాదని అందరికీ ఒకే నిబంధన అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సమన్యాయం ఎక్కడ ?
జిల్లా కేంద్రాల్లోని అత్యధికంగా పై తరగతుల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత అధికారులు సైతం జిల్లా కేంద్రాల్లోని ఉంటున్నారు. పరిపాలన విభాగమంతా పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అక్కడే కొన్ని ప్రవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠాలు బోధిస్తున్న నిబంధనలను దూరం చేస్తున్న పట్టించుకోవడం లేదు. చదివితే తప్పేముంది అనుకునే వారికి, ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చదువుతున్న విద్యార్థులకు మరి ఎందుకు 10వ తరగతి పుస్తకాలు ముందుగా అందివ్వడం లేదు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. సంబంధిత అధికారులకు విషయాలు తెలుసా ? తెలియదా ? అనే విషయాలు పక్కన పెడితే ప్ర భుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వాన్ని ఇబ్బందులు ఉన్నాయన్నట్టు ఈ విధానం చూస్తే అర్థమవుతుంది. పాఠశాలల పర్యవేక్షణకు మాత్ర మే ఉన్న విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకొని అంద రికీ సమానమైన. నిబంధనలను అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రత్యేక దృష్టి పెడతాం...
ప్రైవేట్ స్కూల్‌లో అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం కాకుండా వారి ఇష్టం సారంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు 10వ తరగతి విద్యాబోధన చేస్తే చర్యలు తీసుకుంటాం. 9వ తరగతి వార్షిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత పదవ తరగతి విద్యాబోధన అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడం లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాగా 9వ తరగతి మాత్రం పూర్తి స్థాయిలో నిబంధన మేరకు పూర్తి అయిన తర్వాతే పదవ తరగతి పాఠ్యాంశాలు బోధించాలి. ప్రభుత్వ పాఠశాలలను 9వ తరగతి వార్షిక పరీక్షలు పూర్తయిన తర్వాత ఆన్లున్ ద్వారా విద్యాబోధన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.
-ప్రవీణ్ కుమార్, డీఈవో, మహబూబ్ నగర్