పభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు డి మాండ్ చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె పై బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పం దించారు.
మెదక్ పట్టణంలో శాంతియుతం గా నిరసన తెలుపుతున్న ఉద్యోగులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించడాన్ని ఆ యన ఖండించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ప్రభుత్వం ఉలుకు పలుకు లేదన్నారు.
నిర్బంధించిన సమగ్రశిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల్లో చెప్పినట్లుగా వారిని రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు.