కామారెడ్డి, నిర్మల్, డిసెంబర్27(విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు భిక్షాటన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హ మీలను నెరవేర్చాలని డిమాండ్ చే శారు.
ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కారించాలని కోరారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స త్యనారాయణ, మాలిక్, వసంతి, రా ములు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వశిక్షా అ భియాన్ ఆర్డీవో కార్యాలయం ముం దు సమ్మెను కొనసాగించారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ 18 రోజులుగా సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఎస్‌వోలు, కాంట్రాక్టు టీచర్లు సమ్మెలో పాల్గొనగా శుక్రవారం నిర్మల్ జిల్లాలో కేజీబీవీల్లో విద్యార్థులకు వంట చేస్తున్న కార్మికులు సమ్మెలో చేరారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.