తిరుపతి మాడ వీధుల్లో భక్తులకు దర్శనం
వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాం తి): తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7 గంట ల నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ నిర్వహించారు.
అంతకుముందు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషు డిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపం చం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శించే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
తిరుమల పవిత్రతను కాపాడాలి: ఏపీ సీఎం చంద్రబాబు
తిరుమల ఆలయ పవిత్రతను, నమ్మకా న్ని కాపాడేలా అధికారులు పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించా రు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ప్రశాంతత కు ఎక్కడా భంగం కలగకూడదని సూచించా రు. ఏ విషయంలో రాజీపడొద్దని, భవిష్యత్తు నీటి అవసరాలకు ముందుస్తు ప్రణాళికలు రచించాలన్నారు.
ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడు కొనసాగించి మరింత మెరుగుప ర్చాలని, తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడా వుడి కనిపించకూడదని చెప్పారు. భక్తుల పట్ల టీడీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. రెండు రోజు పర్యటనలో అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు.