calender_icon.png 13 February, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీళ్లచెరువులో శ్రీవారి ‘కల్యాణం.. వైభోగం..’

13-02-2025 12:00:00 AM

  • అంగరంగవైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి తిరు కల్యాణం
  • వేడుకలో పాల్గొన్న దయాకర్ రెడ్డి, బాలసాని, స్వర్ణకుమారి, శ్రీనివాస్ రెడ్డి 
  • కనులారా తిలకించిన వేలాది మంది భక్తులు అన్నదానం ప్రారంభించిన దయాకర్ రెడ్డి 

కూసుమంచి, ఫిబ్రవరి 12 : కళ్యాణం.. కమనీయం.. శ్రీనివాసుడి కళ్యాణ వైభో గం.. పద్మావతి సమేత శ్రీనివాసుడి కళ్యా ణం కమనీయంగా జరిగింది. అభిజిత్ లగ్నం.. దైవ సుముహూర్తమున అర్చకుల అత్యంత వేదమంత్రోచ్ఛ ప్రవచనాలతో శ్రీ వెంకటేశ్వరుడి పరిణయం అత్యంత వైభ వంగా జరిగింది. వేలాది మంది భక్తులు కనులారా తిలకించి పునీతులయ్యారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు. 

అత్యంత వైభ వోపేతంగా జరిగిన ఈ కల్యాణ వేడుకలకు రాష్ర్ట నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. దేవాలయ చైర్మన్ అంబాల వెంకటలక్ష్మి, లక్ష్మినారాయణ, దేవాలయ మేనేజర్ జగన్ మోహన్ రావు, జూనియర్ అసిస్టెంట్ మురళి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.

ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..

తెలంగాణలోని చిన్న తిరుపతిగా పేరు గాంచిన కూసుమంచి మండలం జీళ్ళ చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఈనెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్స వాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాల య పాలకమండలి, దేవదాయ శాఖ ఆధ్వ ర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గడిచిన ఐదు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు వేదమంత్రోత్సవం నడుమ కొనసాగుతున్నాయి.

వైభవంగా శ్రీవారి కల్యాణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రా మానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనముతో, శ్రీ పాంచరాత్ర ఆగమ ద్రావి డ వేద ప్రబంధ పారాయణాదులతో జీళ్ళ చెరువు శ్రీనివాసుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో దైవముహూర్తం మధ్యాహ్నం 12 గంట లకు పద్మావతి సమేత శ్రీనివాసుడి కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిపించారు.

యాజ్ఞకులు వెలగలేటి రామానుజచా ర్యులు సహాయకులు చిలకమర్రి స్వామినా థ్, కిరణ్, వంశీ, రంగనాథ్, రంగ బాలాజీ వేధమంత్రోత్సవ నడుమ శ్రీవారి కల్యాణం జరిపించారు. ప్రధాన అర్చకులు చిలక మర్రి సీతారామానుజచార్యులు, అప్పలా చార్యులు, రాధాకృష్ణమాచార్యులు, జనార్ధ న చార్యులు, వైభవంగా కళ్యాణ వేడుకల ను జరిపించారు. 

వేడుకలో హాజరైన ప్రముఖులు..

కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ర్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత నాయ కులు, ఖమ్మం క్యాంపు కార్యాల ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ర్ట నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు హాజరయ్యారు.

దేవాలయ పాలక చైర్మన్ వెంకటలక్ష్మి, పాలక సభ్యు లు రైతుగాని శేఖర్ బాలబోయిన శ్రీనివాస్, రామడుగు నాగేశ్వరరావు, గుమ్మడిల్లి వెం కన్న, బెల్లం రామారావు, కత్తి రాధమ్మ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అతిథు లకు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్య క్రమంలో కూసుమంచి, నేలకొండపల్లి మండల నాయకులు మాదాసు ఉపేందర్, పెండ్ర అంజయ్య, కొండ శ్రీనివాసరావు, కంచర్ల జీవన్‌రెడ్డి, చాట్ల పరశురాం, కనతా ల నాగయ్య, నెల్లూరు భద్రయ్య, శాఖమూ రి రమేష్, అంబాల లింగయ్య, నాగేశ్వరరా వు, రాంగోపాల్, ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమాన్ని దయాకర్ రెడ్డి ప్రారంభించారు.