- స్వామివారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది
2024 వివరాలు వెల్లడించిన టీటీడీ
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వరస్వామివారికి 2024లో హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్టు పాలక మండలి తెలిపింది. గత ఏడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 99 లక్షల మంది తల నీలాలు సమర్పించారని వివరించింది. 6.30 కోట్ల మంది అన్న ప్రసాదం స్వీకరించినట్టు పేర్కొన్నది. 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్టు వెల్లడించింది.