ఏర్పాట్లు చేయాలని ఏఈవో వెంకయ్య ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తిరుమలలో అక్టోబర్ 4 నుంచి నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడుసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువ ఉండే కారణంగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 నుంచి 8వ తేదీ అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అదే విధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్నారైలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.