26-03-2025 12:11:17 AM
ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): తెలంగాణ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ (టీఎస్పీఏ) నగర అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీశైలం యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం గాంధీ నగర్ లోని టీఎస్పీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో మండల స్థాయి నుంచి నగర కమిటీ వరకు పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి విద్యా సంస్థల్లో తప్పని సరి గా మౌలిక సదుపాయాలు ఉండేలా తన వంతు కృషి చేస్తానన్నారు.