calender_icon.png 6 March, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు పూర్తి.!

06-03-2025 08:40:29 AM

- 16 రోజుల్లో 5.89 కోట్లు.

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల(Maha Shivaratri Brahmotsavam) సందర్భంగా శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు మల్లన్నకు కానుకల రూపంలో హుండీలో వేసిన ఆదాయం 16 రోజుల్లో 5.89 కోట్లు నమోదయిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం లెక్కించిన ఉండి లెక్కింపులో 5,89,55,455 నగదు తో పాటు 87 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 850 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు తెలిపారు. దీంతోపాటు  యుఎస్ఏ డాలర్లు - 885, యూఏఈ దిర్హమ్స్-105, యూకే ఫౌండ్స్ 80, సింగపూర్ డాలర్లు -2, కెనడా డాలర్లు 5 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.