calender_icon.png 7 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలానికి పూడిక ముప్పు!

05-01-2025 12:43:17 AM

  1. ఏటా వరద నీటితో పాటు సుమారు 5 శాతానికి పెరుగుదల
  2. తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం 
  3. తేటతెల్లం చేస్తున్న సీడబ్ల్యూసీ నివేదిక
  4. తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీటికి గడ్డు కాలం!

నాగర్‌కర్నూల్, జనవరి 4 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు జీవనాడిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఏటా నీటితో పాటు సుమారు 5 శాతా  పైగా వరద వెంట వచ్చే మట్టి పూడిక రూపంలో పేరుకుపోవడంతో నీటి నిల్వ సా  తగ్గుతూ వస్తున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

శ్రీశైల ప్రాజెక్టుకు కుడి, ఎడమ గట్టు ప్రాంతంలో నెలకొన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రెండు తెలుగు రా  వెలుగులు నింపుతున్నాయి. దీంతో పాటు హంద్రీనీవ, గాలేరు  నగరి, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ ఈ పథకాలకు కేసీ కెనాల్ ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలోని వేలాది గ్రామాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు మండు వేస  తాగు నీటిని అందిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు 308.06 టీఎంసీల సామర్థ్యం నీటి నిల్వతో డెడ్ స్టోరేజీ మినహా సుమారు 253.05 టీఎంసీల నీటిని తాగు, సాగునీటికి ఆయా ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకునే అవకాశం లభించేంది. ప్రస్తుతం 215 టీఎంసీల నీటి సామ  క్రమంగా తగ్గుతూ వచ్చింది. సుమారు 93 టీఎంసీల మేర పూడిక మట్టి పేరుకుని పోవడంతో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది.

ఏటా కృష్ణానది ఉప్పొంగిన సమయంలో వరద నీటితో పాటు అక్కడక్కడ చెట్లు నరికివేత కారణంగా మట్టి కూడా కొట్టుకుని రావడంతో ప్రాజెక్టులో సుమారుగా 5 శాతం మట్టి పేరుకుపోతున్నట్లుగా ఈ మధ్యే సీడబ్ల్యూసీ (జల వనరుల శాఖ) కేంద్రానికి ఇచ్చిన నివేదికలో తెలుస్తోంది. అతికొద్ది సమయంలో ప్రాజెక్టు మనుగడ ప్రశార్థకంగా మారుతుందని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

కేంద్రం చొరవ చూపితేనే ఫలితం!

సుమారు 100 టీఎంసీల మేర పేరుకుపోయిన ఒండ్రుమట్టిని వెలికి తీయాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. సిద్ధేశ్వరం, సోమశిల వద్ద గల కొండల మధ్యలో నూతన ప్రాజెక్టు నిర్మితమైతే కృష్ణా నీటిని ఒడిసిపట్టి కొన్ని ప్రాజెక్టులకు నీటిని అందించేలా ప్రాజెక్టును రూపకల్పన చేయాలనే అభి  ఏపీ ప్రజల నుంచి వినిపిస్తోంది. కానీ కోతిగుండ వద్ద శ్రీశైలం ప్రాజె  నిల్వ నీటిని మళ్లిస్తే ప్రాజెక్టులో పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించే ప్రక్రియ సులువుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.