calender_icon.png 25 February, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైల మహాక్షేత్రంలో భక్త జన సందోహం!

25-02-2025 12:57:34 AM

 నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఈనెల 26న మహాశివరా త్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశారు సుమారు 11 రోజుల పాటు జరిగే మహా శివరాత్రి వేడుకలకు స్వామివారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. సోమవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవా లలో ఆరవ రోజైన స్వామి అమ్మవార్లకు విశేష పూజలందించారు.

లోక కల్యానార్థం జపాలు, పారాయణలు చేపట్టారు. మండ పారాధనలు, పంచావరణార్చనలు, శివపం చాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించారు. ఎండల వేడిమి దృష్ట్యా భక్తులకు క్యూ లైన్ లో చలువ పందిలను ఏర్పాటు చేసి క్యూలైన్లో నిల్చోని ఉన్న వారికి తాగునీరు అల్పాహారం వంటివి పంపిణీ చేస్తున్నారు. దర్శనానంతరం భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదంగా అందిస్తున్నా మని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 45 రోజుల పాటు కటోర దీక్షపుని తమ మొక్కలు ఇరుముడి రూపంలో చెల్లించుకునేందుకు శివ భక్తులు అన్ని దారుల గుండా కాలినడకన ప్రయాణిస్తుండడంతో ప్రధాన రహదారుల వెంట శివ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఉన్నతాధికారులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.