calender_icon.png 28 November, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం, సాగర్ గేట్లు బంద్!

13-08-2024 01:57:13 AM

  1. కృష్ణా బేసిన్‌లో వరద తగ్గుముఖం 
  2. తుంగభద్ర డ్యాం అన్ని గేట్లు ఓపెన్

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పడుతోన్న క్రమంలో గేట్లు మూసేశారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల్లో ఖాళీని నింపేందుకు అక్కడి అధికారులు గేట్లు మూసేశారు. దీంతో జూరాలకు వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఫలితంగా జూరాల గేట్లు సైతం అధికారులు క్లోజ్ చేశారు.

ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను కూడా మూసి వేయడంతో దిగువనకు వరద ఆగిపోయింది. తుంగభద్ర ప్రాజెక్టు గేటు ఊడిపోవ డంతో ప్రాజెక్టులో ఉన్న నీటిలో దాదాపు 6ంశాతం ఖాళీ చేయాల్సిన పరిస్థితిలో గేట్లన్నింటినీ ఎత్తేసి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల భారీ వరద  శ్రీశైలంకు వస్తోంది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో సాగర్ గేట్లను సైతం మూసేశారు.