calender_icon.png 22 January, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక కేంద్రంగా శ్రీరంగనాయకస్వామి ఆలయం

22-01-2025 02:22:20 AM

సినిమా షూటింగ్ లకు కేంద్ర బిందువుగా మారనున్న శ్రీరంగాపురం బోటింగ్ షికారు సుందరీకరణకు భారీగా నిధులు మంజూరు.. త్వరలో సుందరీకరణ పనులకు ఏర్పాట్లు

వనపర్తి, జనవరి 21 ( విజయక్రాంతి ) :  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అత్యంత పేరుగాంచిన  శ్రీ రంగనాయక స్వామి చెంతన పర్యాటక అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భక్తులు,  చిన్నారులు, పర్యాటకుల కోసం ప్రభుత్వం భారీగా నిధులను  మంజూరు చేస్తుంది.

శ్రీ రంగనాథుని ఆలయం చుట్టూ కృష్ణానది నీళ్లతో కలకల లాడుతున్న రిజర్వాయర్ లో పర్యాటకుల కోసం బోటింగ్ షికారితో పాటు సుందరీకరణ పనులు చేసేందుకు సిద్ధమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారీగా నిధులు కేటాయించగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తన నియోజకవర్గం లో ప్రత్యేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపద్యంలో 1  కోటి 50 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ ప్రాంతం  ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సినిమాలు తీసేందుకు అను కూలంగా మార్చేలా పర్యాటకం అభివృద్ధి చెందనుందని  దీంతో ఆలయానికి పూర్వ వైభవం రానున్నదని ఉమ్మడి జిల్లా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ప్రాంతంలో  రెస్టారెంట్లు, కాటేజీలు,రోడ్లు,  లైటింగ్, గార్డెన్ నిర్మాణం, కాలినడకన దారులు వంటి పలు ఏర్పాట్లకి నిధులను వినియోగించేలా ఉత్తర్వులో పేర్కొన్నారు 

 సినిమా షూటింగ్‌లకు కేంద్ర బిందువుగా..

 ఆహ్లాదకరమైన వాతావరణం, కండ్లను కట్టిపడేసే గల శిల్ప సంపద ఇక్కడ ఆలయ ప్రత్యేకత. దీంతో ఇప్పటికే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో మరి సినిమాలు సీరియల్స్ వంటి షూటింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగనుండడంతో సినిమా షూటింగ్లకు కేంద్ర బిందువుగా మారుతుందని స్థానికులకు సైతం పలు ఉపాధి అవకాశాలు గ్రామస్తులు తమ సంతోషాలను  వ్యక్తం చేస్తున్నారు. 

పర్యాటక కేంద్రంగా మారిస్తే మరింత అభివృద్ధి 

శ్రీరంగాపురం మండల కేంద్రంలో గల శ్రీ రంగనాయక స్వామి  ఆలయంతోపాటు శ్రీ రంగ సముద్రం రిజర్వాయర్  ఉండడంవల్ల ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే  ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుంది.

శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించిన  సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లు రవిలకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.

 తూడి మేఘారెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు