05-03-2025 12:04:29 AM
ఉపాధ్యాయులం విజయం పిఆర్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు, బి రవి..
కొత్తగూడెంలో పిఆర్టియు సంబరాలు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టియు అభ్యర్థి శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం ఉపాధ్యాయుల విజయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవి అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ఓల్డ్ డిపో వరకు విజయోత్సవ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వరరావు(డి.వి) మాట్లాడుతూ... పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చడానికి పిఆర్టియు సంఘం, పింగళి శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో తప్పక కృషి చేస్తుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసినటువంటి మండల జిల్లా రాష్ట్ర బాధ్యులకు ప్రాథమిక సభ్యులకు ఓటు వేసి గెలిపించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవి మాట్లాడుతూ... పిఆర్టియు అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం అనేది ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేకూర్చుతుందని, రాబోయే కాలంలో ఉపాధ్యాయుల సమస్యలన్నీ సాధించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఆర్టియు శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. తదనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు బి రవి జండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలందరికీ మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.