హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): శాసనమండలికి జరగబోయే రెండు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను పీఆర్టీయూ టీఎస్ ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గానికి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గానికి వంగ మహేందర్‌రెడ్డిని ప్రకటించింది. సంఘం నియమా వళి ప్రకారం 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో వీరిద్దరిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి తెలిపారు.