02-03-2025 06:53:32 PM
మంథని (విజయక్రాంతి): శ్రీపాద రావు 88వ జయంతి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కామన్ వద్ద ఆదివారం భక్తులకు మంథని, కమాన్ పూర్, ముత్తారం, రామగిరి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, రెబల్ రాజు, మోతుకూరి అవినాష్, వినీత్ యాదవ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.