03-03-2025 12:21:01 AM
మహబూబాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): దుద్ధిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఆదివారం కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.వీరబ్రహ్మచారి జిల్లా అధికారులు డిడి గ్రౌండ్ వాటర్ వేముల సురేష్, ఫిషరీస్ వీరన్న, మైనారిటీ అధికారి శ్రీనివాస్, జిఎం ఇండస్ట్రీస్ సత్యనారాయణ రెడ్డి, డీఎం సివిల్ సప్లు కృష్ణవేణి, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మదన్ గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.