03-03-2025 12:02:36 AM
మంథని, మార్చి 2 (విజయక్రాంతి): అజాతశత్రువు శ్రీపాదరావు అని మంథని లో రోగులకు పండ్లు పంపిణీలో రాష్ర్ట మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని రావు చెరువు కట్ట లో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, శ్రీపాద చౌరస్తాలో శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు పూలమాలవేసి రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రాష్ర్ట మంత్రి చేతుల మీదుగా మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు మరియు హాస్పటల్లో పనిచేసే సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. అలాగే మంథని బస్టాండ్‌లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్‌ఎస్ యుఐ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు అందజేశారు.
తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నాం
మంథనిలో శ్రీపాద జయంతి వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, మార్చి 2 (విజయక్రాంతి): తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని పట్టణంలో ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు (88) జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంత్రి ప్రాంతానికి ఎందరో మహానుభావులు గుర్తించారని అందులో మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ కిషన్ రావు తన తండ్రి శ్రీపాదరావు మంథనికే కాకుండా రాష్ట్రానికి దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు.
అనంతరం శ్రీఫాదరావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత పనిచేసే తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, శశి భూషణ్ కాచే, పోలు శివ, సురేందర్ రెడ్డి, కొండ శంకర్, లింగయ్య యాదవ్, కుడుదుల వెంకన్న, గోటికర్ కిషోన్ జీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలు మరువలేనివి
ఆర్జీ 3 జీఎం నరేంద్ర సుధాకర్ రావు
రామగిరి, మార్చి 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు సేవలు మరువలేనివని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేం ద్ర సుధాకరరావు అన్నారు. ఆదివారం జీ ఎం కార్యాలయంలో నిర్వహించిన స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలలో భాగంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాదరావు మంథని నియోజవర్గ శాసన సభ్యులుగా ఆ ప్రాంత అభివృద్ధి తో పాటు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారన్నారు. అంతే కాకుండా వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా పని చేసినప్పుడు స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలకు అవకాశం కల్పించి అందరి మన్ననలు పొందారని, పేద ప్రజల సంక్షేమం కోసం వారు చేసిన సేవలు మరువలేనివని, వారిని ఆదర్శంగా తీసుకొని మంచి బాటలో నడవాలన్నారు.
కార్యక్రమంలో ప్రాతినిధ్య సంఘం నాయకులు కోట రవీందర్ రెడ్డి, ఏరియా అధికారుల సంఘం ప్రతినిధి జి.శ్రీనివాస్, అధికారులు కె.ఐలయ్య, షబ్బీరిద్దీన్, సునీల్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, మతీన్ హుస్సేన్, బి.మురళి, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.