03-03-2025 12:00:00 AM
పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, మార్చి 2 (విజయక్రాంతి) : మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు ఎనభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని నగరంలోని రంగినేని గార్డెన్స్ లో ఘనంగా రాష్ర్ట స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. టోర్నమెంట్ కమిటీ చైర్మన్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ళ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ప్రారంభించారు.
కార్యక్రమంలో రెండవ డివిజన్ మాజీ కార్పోరేటర్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్,ఎండి తాజ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,ఆర్ష మల్లేశం, నగేష్ ముదిరాజ్,ఆకారపు భాస్కర్ రెడ్డి,దన్న సింగ్,సుదర్శన్,బొబ్బిలి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.