calender_icon.png 3 March, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీపాద రావు జయంతి వేడుకలు

02-03-2025 07:50:07 PM

కాటారం (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు 88వ జయంతి సందర్భంగా ఆదివారం కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాద రావు ఒకరని, వారి సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసిన నాయకుడు శ్రీపాద రావు అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా సమర్థ వంతంగా విధులు నిర్వహించారన్నారు.

అలాంటి  నాయకుని అకాల మరణం మంథని ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనను ముందుకు తీసుకువెళ్ళడానికి తన తనయుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ, రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నారని అన్నారు. తండ్రి ఆశయ సాధనలో అన్న శ్రీధర్ బాబుకు తోడుగా శ్రీను బాబు మంథని ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, నాయకులు దబ్బేట రాజేష్, నాయిని శ్రీనివాస్, అంగజాల అశోక్ కుమార్, మంత్రి నరేష్, అజ్మీర రఘురాం, ఓం సింగ్, గద్దె సమ్మిరెడ్డి, కుంభం రమేష్ రెడ్డి, భూపెల్లి రాజు, మహిళా నాయకురాలు ఆంగోతు సుగుణ, ఐత శకుంతల, గంట లక్ష్మి, యూత్ నేతలు చీమల రాజు, మాచర్ల రాజేందర్, పసుల మొగిలి, కర్క ఉమాశంకర్, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, కొట్టే శ్రీహరి, జాడి రమేష్, కొట్టే ప్రభాకర్, ఆత్మకూరి కుమార్ యాదవ్, చీర్ల తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి, అశ్రాఫ్ తదితరులు పాల్గొన్నారు. 

ధన్వాడలో శ్రీపాదరావు జయంతి వేడుకలను తన స్వగ్రామమైన ధన్వాడలో వారి మంత్రి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, బోడ శ్రీకాంత్, చల్ల, శ్రవణ్, శ్రీకాంత్, స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.