02-03-2025 04:30:11 PM
జిల్లా కలెక్టర్ రాజర్షి షా....
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు వన్నె తెచ్చిన స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు రాజకీయ నేతగా, న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ బాబు, సూపెరెండెంట్ శైలజ, పంచపూల, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.