calender_icon.png 4 March, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజాతశత్రువు అందరివాడు శ్రీపాద రావు

02-03-2025 04:26:58 PM

కేశనపల్లిలో జయంతి వేడుకల్లో పీఏసీ ఎస్ చైర్మన్ అల్లాడి, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ  

ముత్తారం (విజయక్రాంతి): అజాతశత్రువు అందరివాడు మాజీ స్పీకర్ శ్రీపాదరావు అని ముత్తారం సింగిల్ విండో చైర్మన్ యాదగిరిరావు, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్యలు అన్నారు. శ్రీపాద రావు  జన్మదినం సందర్భంగా ముత్తారం మండలంలోని కేశనపల్లిలో శ్రీపాద రావు విగ్రహం వద్ద జయంతి కార్యక్రమంలో కేక్ కట్ చేసి, విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. 

అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువజన కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్, యూత్ మండలాధ్యక్షుడు బక్కదట్ల వినిత్ యాదవ్, నాయకులు తూటి రఫీ, శ్రీనివాస్, సంజీవరెడ్డి, విజయ్, బక్కత కుమార్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.