calender_icon.png 1 March, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రేపు అధికారికంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

01-03-2025 12:30:02 PM

కాటారం,(విజయక్రాంతి): మంథని శాసనసభ నియోజకవర్గం(Manthani Assembly constituency) మాజీ ఎమ్మెల్యే, పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి(Duddilla Sripada Rao Jayanthi) వేడుకలను మార్చి రెండున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీపాదరావు తనయుడు ప్రస్తుతం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అలాగే మరో తనయుడు దుద్దిళ్ళ శ్రీనుబాబు(Duddilla Srinu babu) మంథని నియోజకవర్గంలో శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వెలువడిన ఉత్తర్వుల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహాదేవపూర్, పలిమల, మహా ముత్తారం, మల్హర్ మండలాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నారు. మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రీపాదరావు శ్రేయోభిలాషులు జయంతి వేడుకలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు.