మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు బాధితులను పరామర్శించారు. కమాన్ పూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు జెమినీ గౌడ్ ను, రామగిరి మండలంలో పాత్రికేయుడు శ్రావణ్ తల్లి ఆనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మంథని మండలంలో ని లక్కేపూర్ కాంగ్రెస్ నాయుడు మంథని మల్లేష్ ఆనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనను పరామర్శించారు. ఆయన వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, సీనియర్ అడ్వకేట్ రమణకుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.