calender_icon.png 24 April, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో బాధిత కుటుంబాలకు శ్రీను బాబు పరామర్ష

24-04-2025 02:41:21 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుదిళ్ల శ్రీను బాబు గురువారం పరామర్శించారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ అత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను, తోట పుల్లమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, ఆవదానుల మోహన్ శర్మ అక్క మృతిచెందగా వారి కుటుంబాన్ని, బెజ్జాల హరికిరణ్ తల్లి సావిత్రమ్మ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను శ్రీను బాబు, పరామర్శించి, బుత్తుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, మాజీ ఎంపీపీ కొండ శంకర్,  మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.