calender_icon.png 5 December, 2024 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామన్ మ్యాన్ మంథనిలో.. శీను బాబు

04-12-2024 10:55:14 PM

ప్రజలతోనే.. రోజంతా...

ఏమాత్రం గర్వం లేకుండా... సాదరణ కార్యకర్తగా  శీను బాబు పాత్ర...

సీఎం సభ సక్సెస్ లో ముఖ్య భూమిక

మంథని (విజయక్రాంతి): మంథని అంటేనే మంత్రి శ్రీధర్ బాబు అనే పేరు ఉండేది... తమ్ముడు శీను బాబు.. అన్న కోసం తమ్ముడిగా... రాముడు కోసం లక్ష్మణుడిలా... బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన యువ వికాస విజయవంతంలో శీను బాబు కామన్ మ్యాన్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. మంథని నియోజకవర్గం నుంచి... జరుగుతున్న అభివృద్ధి పనులపై.. ఊరు ఊరుకు వెళ్లి... అందరికీ అవగాహన కల్పించడంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరగబోయే, జరిగిన అభివృద్ధి పనులపై.. సామాన్య ప్రజలకు వివరిస్తూ తాను కూడా లక్ష్మణ పాత్ర పోషించాడు... అంటూ పెద్దపల్లి జిల్లా ప్రజలే చర్చించుకుంటున్నారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా.. అర్ధరాత్రి ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా.. హైదరాబాదు నుంచి ఆగమేఘాల మీద.. తన అన్న శ్రీధర్ బాబు సూచనల మేరకు.. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి తన వ్యక్తిగత పనులను పక్కన పెట్టు సాయం అందిస్తున్నాడు అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి... ప్రజలకు వివరిస్తూ... సీఎంకు కృతజ్ఞతలు చెప్పాలంటూ.... ప్రతి ఊరు ఊరికి వెళ్లి కామన్ మ్యాన్ గా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను ప్రజలందరినీ సభకు చేరేలా కృషి చేసిన ఆయన తీరుపై మంత్రి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.