24-02-2025 02:12:50 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేశన పల్లి గ్రామంలో యువ నాయకులు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్, మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బియ్యని శివకుమార్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజిద్ పాషా, కేశన పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెగడ కుమార్ యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.