24-02-2025 09:25:16 PM
మంథని (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన సందర్భంగా మంథని మండలంలోని కన్నాల ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీను బాబు కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని మంథని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పూజ, అర్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, నాయకులు బండారి ప్రసాద్, పాపిరెడ్డి, తోకల మల్లేష్, జగ్గారెడ్డి, మిరియాల విజయ రామ్ రెడ్డి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.