calender_icon.png 26 March, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండుగగా శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

25-03-2025 08:57:52 PM

తండోపతండాలుగా కదలివచ్చిన భక్తజనం..

జనసంద్రంగా మారిన శ్రీనివాసగిరి గుట్ట..

పాల్వంచ (విజయక్రాంతి): శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుట్ట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుట్టపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళ వాయిద్యాలతో మామిడి తోర్నాపాకు సాక్షిగా ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ శర్మ, అర్చకులు ఫణిరాజాచార్యులు, హరిచార్యులు, సంతోషకుమార చార్యులు, వరుణ్ కుమార చార్యులు, మణిదీపాచార్యులు తదితర వేదపండితులు వేదమంత్రాలతో పూజల నిర్వహించారు.

సాంప్రదాయ బద్దంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు స్వామివారి వార్షిక కళ్యాణాన్ని తిలకించడానికి విచ్చేయడంతో శ్రీనివాసగిరి మొత్తం గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణతో గిరి మారుమ్రోగింది. ఈ స్వామివారి వార్షిక కళ్యాణానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు సుమారు 20 వేల మంది భక్తులు తరలి రావడం జరిగింది. వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. అదే విధముగా ఈ  కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ భక్తులకు ఉచిత ORS పాకెట్స్ లను పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్త సమాజ మండలి సభ్యులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ ఎమ్మార్వో వివేక్ పట్టు వస్త్రాలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా సమర్పించారు. స్వామివారి కల్యాణంలో కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు మున్సిపల్ కమిషనర్ సుజాత  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భక్త సమాజం మండలి అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల లక్ష్మణ్, ధర్మపురి రాము, సమన్వయకర్త ఊకె భద్రయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు రాము కోశాధికారి శ్రీలత ఉపాధ్యక్షులు బండి నారాయణ, లక్ష్మీ రెడ్డి సలహా మండలి సభ్యులు వంకదారు నరసింహ కుమార్, మిట్టపల్లి నరసింహ రావు, కంటాల వెంకటేశ్వరరావు, ఒంటెద్దు నర్సిరెడ్డి, వేమూరి వెంకటేశ్వర్లు, మేదరమెట్ల శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి జిన్నా రమేష్ సేవాదళ్ ఆర్గనైజర్ బండి అంబేద్కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.