21-12-2024 07:25:39 PM
మంథని (విజయక్రాంతి): శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జడ్పీ హెచ్ ఎస్ (గర్ల్స్)మంథని పాఠశాలలో నిర్వహించిన గణిత దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు టీఎల్ ఎం పలువురిని విశేషంగా ఆకట్టుకొన్నది. విమర్శలలో గణితం పట్ల ఆసక్తిని అభిరుచిని పెంపొందించుటకై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు రంగవల్లి పోటీలు, క్విజ్ నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన విద్యార్థిని, విద్యార్థులకు హెచ్ ఎం సుమలత, గణిత ఉపాధ్యాయులు గీట్ల భరతారెడ్డి, పరంజ్యోతి, విజయ కుమారిలు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.