calender_icon.png 12 March, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలను చిదిమేసిన శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష అమలు చేయాలి:వీహెచ్

12-03-2025 12:00:00 AM

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా లోని బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన ముగ్గురు బాలికలపై లైంగిక దాడి చేసి, వారిని హత మార్చిన శ్రీనివాస్‌రెడ్డికి న్యాయస్థానా లు ఒక కేసులో ఉరిశిక్ష, మరో కేసులో యావజ్జీవ శిక్ష విధించాయని, అయినప్పటికీ అవి అమలుకాకపోవడం బాధాకరమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడారు. నాటి ఎస్పీ మహేష్ భగవత్ ఎంతో శ్రమించి కేసును ఛేదించారని, నిందితుడు శ్రీనివాసరెడ్డిని చాకచక్యంగా పట్టుకున్నారని, కోర్టుల సాక్ష్యాధారాలు పెట్టి శిక్ష పడేలా చేశారని గుర్తుచేశారు.

న్యాయస్థానం తీర్పు మేరకు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష అమలు చేయాలని తాను ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశానని వెల్లడించారు. ప్రణయ్ హత్య కేసులో నల్లగొం డ న్యాయస్థానం ఏ2 సుభాశ్‌శర్మకు ఉరి శిక్ష, మిగతా దోషులకు యావజ్జీవ శిక్ష వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో అప్ప టీ నల్లగొండ ఎస్పీ, ప్రస్తుత హైడ్రా చైర్మన్ రంగనాథన్ ఎంతో శ్రమించి కేసును ఛేదించారన్నారు. పోలీసులు కష్టపడి  ఛేదించిన కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు వేసినా.. అవి అమలుకాకపోవడం దారుణమన్నారు.