కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల ప్రత్యేకాధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కామారెడ్డి, బాన్సువాడలో మున్సిపల్ అధికారులతో వేర్వేరుగా సమావేశ బల్దియాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సమస్యలు పరిష్కారించాలని అధికారులకు సూచించారు.