ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తారని వెల్లడించింది.