24-02-2025 06:25:39 PM
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలో సోమవారం లహరి కృష్ణ భక్తులు మహిమదిన ఉత్సవా పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీమన్నారాయణ శ్రీలాహరీకృష్ణ ఉపదేశాలను భక్తులు జ్ఞాపకం చేసుకొని ఉచ్చరిస్తు వారు ఉపదేశించిన ఉపదేశములలో ఒకే దేవుడు ఒకే దేశము సిద్ధాంతంమును మానవులందరూ ఒక్కటేనన్నారు. మనమందరం ఆయన సృష్టి జాతి, మత, కుల, బెదములను మరచి ప్రజలందరు సోదరబావంగా జీవించాలని ప్రబోధించారు.
మానవుల యొక్క జన్మ విమోచన నిమిత్తం బ్రహ్మ ఆదిలోనే యజ్ఞాన్ని నిర్వహించి మానవుల యొక్క జన్మ కర్మ పాపముల నుండి విముక్తి గావించినాడనీ, ఇట్టి బ్రహ్మ జ్ఞానమును అనేక వేదములలో రహస్యముగా వ్రాయబడియున్న, జ్ఞానాన్ని కలియుగమునందు మానవులు గ్రహించుకుండయున్నారనీ, ఇట్టిమర్మమైన బ్రహ్మజ్ఞానం లహరికృష్ణ సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా విడమర్చి వివరించరన్నారు.
ఈ కలియుగం నందు ఎవరైతే ఇట్టి బ్రహ్మజ్ఞానాన్ని ధ్యానిస్తు భగవంతునికి స్తుతియాగం చేస్తారో వారు ఈ యుగం నందు జన్మ విమోచనం (కైవల్యం) పొందగలరని శ్రీ లహరికృష్ణ మానవులందరికీ ప్రబోదించియున్నారని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని సెంటర్ భక్తులు, ముత్తారం కేశనపల్లి, గుర్రంపల్లి, యైటింగ్ లైన్ కాలనీ, గోదావరిఖని మంచిర్యాల సీ.సి. శ్రీరాంపూర్ నార్లాపూర్, కరీంనగర్ పలు గ్రామాలకు సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.