calender_icon.png 20 April, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 గంటలు వైద్య సేవలు అందిస్తాం..

12-04-2025 04:53:56 PM

డాక్టర్ శ్రీకర్...

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తామని శ్రీరామ హాస్పిటల్ డాక్టర్ శ్రీకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోనీ శ్రీరామ హాస్పిటల్, ఆర్కే హాస్పిటల్ కరీంనగర్, శరత్ మ్యాక్స్ విజన్ హన్మకొండ ఆధ్వర్యంలో సంయుక్తంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ.... ప్రజలు రోగాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. వివిధ రకాల టెస్టులను అతి తక్కువ ఖర్చు 990 రూపాయలకే నిర్వహించామన్నారు.

మానవ శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైన అని సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడితే నయమవుతుందని సూచించారు. శ్రీరామ హాస్పిటల్ లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎవరికీ ఏ రకమైన సమస్య వచ్చిన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఆర్కే ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రాజకుమార్, శ్రీరామ హాస్పిటల్ నిర్వాహకులు భరణి కుమార్, శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది పూరి, తిరుపతి పాల్గొన్నారు.