30-04-2025 06:13:05 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఉద్యమకారులు, కళాకారులకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నింగి నేల-మేము సైతం ఆధ్వర్యంలో శ్రీకాంతచారి మెమోరియల్ అవార్డులను అందజేశారు. హైదరాబాదులోని మల్లారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, దరువు అంజన్న, అరుణ చేతుల మీదుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మానుకోట ఉద్యమకారులు, కళాకారులు పిల్లి సుధాకర్, మిట్ట గడుపుల భరత్ కుమార్, మునికుంట్ల ఐలేష్ కుమార్, తూము నవీన్ యాదవ్, శ్రీకర్ కు అవార్డులు అందజేశారు.