calender_icon.png 14 March, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకాంత్ కు సన్మానం

13-03-2025 06:39:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): గత అక్టోబర్ నెలలో విడుదలైన జూనియర్ అధ్యాపక ఫలితాలలో జూనియర్ అధ్యాపకునిగా  ఉద్యోగము సాధించి ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయినా సందర్భంగా లక్ష్మణ చందా మండలం పార్ పెళ్లి గ్రామానికి చెందిన రాజారం శ్రీకాంత్ ను కుమ్మరి జాగృతి మరియు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గురువారం నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ లో ఘనంగా శాలువాతో సన్మానించారు.

సందర్భంగా కుమ్మరి జాగృతి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు భూసారపు గంగాధర్ మాట్లాడుతూ 25 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మొదటి ప్రయత్నంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ గా ఎన్నికైన శ్రీకాంత్ ను అభినందించారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన శ్రీకాంత్ నందిపేట్ మండలం ఐలాపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ గా ఈ రోజు నియామకం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి జాగృతి నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి రఘు ప్రధాన కార్యదర్శి రాజారపు శ్రీనివాస్ సెక్రటరీ కొత్తపల్లి నగేష్ తోడిశెట్టి సతీష్ సిలారి సాయన్న తోడిశెట్టి అభినయ్ అకిరా నందన్ తదితరులు పాల్గొన్నారు