calender_icon.png 28 November, 2024 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకాంత్ గౌడ్‌కు రిమాండ్

27-10-2024 01:14:30 AM

అచ్చంపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 

మహబూబ్‌నగర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రభుత్వ భూమికి దొంగ పట్టాలను సృష్టించాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆ కేసులో ఏ4 నిందితుడైన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ శుక్రవారం రూరల్ పీఎస్‌లో లొంగిపోయాడు.

కోర్టు ఆదేశాల మేరకు శనివారం పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ భూమికి పట్టా చేయిచండంపై అర్బన్ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో నిందితులు రాయుడు, దేవా, రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

ఏ4 నిందితుడు శ్రీకాంత్‌గౌడ్  కోసం గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. శ్రీకాంత్ గౌడ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాలు ఆ పిటిషన్లను తిరస్కరించాయి. దీంతో శ్రీకాంత్‌గౌడ్ రూరల్ పీఎస్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. అచ్చంపేట కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.