calender_icon.png 27 December, 2024 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉద్యమకారుడు శ్రీకాంత చారి..

03-12-2024 04:26:24 PM

ఆ మహనీయుడి బలి దానంతోనే ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం..

నీలం మధు ముదిరాజ్..

పటాన్ చెరు (విజయక్రాంతి): మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఆత్మబలిదానంతో ఊపిరులుది ఉద్యమం ఎగిసిపడేలా చేసిన మహనీయుడు శ్రీకాంతాచారి అని మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో ఉద్యమాన్ని అణచడానికి అప్పటి సమైక్యాంధ్ర పాలకులు పన్నాగాలు చేస్తున్న తరుణంలో తన ఆత్మబలిదానంతో ఉద్యమం నిలబడాలని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారుల్లో స్ఫూర్తినింపారని కొనియాడారు. ఆనాడు ఆ మహనీయుడు ఆత్మబలిదానంతో తెలంగాణ సమాజమంతా ఉవ్వెత్తున ముందుకు కదలి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారుల కుటుంబాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.