రైటర్ మోహన్ రచనా దర్శకత్వంలో వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్, మురళీధర్‌గౌడ్, భద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేశ్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయి ఇద్రీమా నాగరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా టీజర్ గురువారం విడులైంది. టీజర్ చాలా క్యురియాసిటీ పెంచింది. క’, పొలిమేర 2’, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయం సాధించిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. టీజర్ చూస్తే.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఒక పోలీసు అధికారి తనకు క్రిడెట్ వచ్చేలా ఓ క్రిమినల్ కేసును ఛేదించడానికి ఒక తెలివైన డిటెక్టివ్ సాయం కోరుతూ ఆ పనిని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌కు అప్పగిస్తాడు.
మూవీ ప్రిమైజ్‌ను ఆసక్తికరంగా పరిచయం చేస్తోందీ టీజర్. ఇందులో వెన్నెల కిషోర్ లీడ్ రోల్ హ్యుమర్, ఇంటెలిజెంట్ బ్లెండ్‌తో ఆకట్టుకుంది. కేసులను పరిష్కరించడంలో అతని యూనిక్ స్టయిల్‌ను ప్రజెంట్ చేస్తోంది. వెన్నెల కిషోర్ తన పాత్రలో ఒదిగిపోయారు. రైటర్ మోహన్ ఎంగేజింగ్ కథను రూపొందించారు. అతని డైరెక్షన్ కట్టిపడేసింది. మల్లికార్జున్ ఎన్ సినిమాటోగ్రఫీ కథనానికి డెప్త్‌ను జోడించగా, సునీల్ కశ్యప్ స్కోర్ సినిమా జోరును పెంచింది.