calender_icon.png 17 April, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటీల్లో మెరిసిన శ్రీధర్‌బాబు సోదరుడి పిల్లలు

06-04-2025 12:36:33 AM

మంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడి పిల్లలు ఇటీవల నిర్వహించిన ఓ కాంపిటీషన్‌లో ఉత్తమ ప్రతిభ చాటుకున్నారు. పోటీల్లో దుద్దిళ్ల ఆరాధ్య మాథ్స్ మాస్టర్ అవార్డు గెలుచుకోగా కమ్యూనిటీ సర్వీస్‌లో శ్రీయాన్ దుద్దిళ్ల లీడర్‌షిప్ అవార్డును సొంతం చేసుకున్నారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతుల మీదుగా వీరిద్దరూ ఈ అవార్డులను అందుకోవడం విశేషం. సోదరుడి పిల్లలకు తన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడంపట్ల మంత్రి శ్రీధర్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు.